Kashmir conflict: భారత్ పాక్‌లది వెయ్యేళ్ల పోరాటం.. 1,500 ఏళ్లుగా సరిహద్దు సమస్య
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:11 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. 1,500 ఏళ్ల సరిహద్దు సమస్య ఉందని ఆయన చెప్పడం వల్ల సోషల్ మీడియాలో విమర్శలు తలెత్తాయి.
పహల్గాం ఉగ్రదాడి దారుణం: ట్రంప్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: భారత్, పాకిస్థాన్ దేశాలు కశ్మీర్ కోసం వెయ్యేళ్లుగా పోరాడుతున్నాయని, 1,500 ఏళ్లుగా రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు తమంతట తామే ఏదో ఒకలా పరిష్కరించుకుంటాయని పేర్కొన్నారు. పోప్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాటికన్ సిటీకి ప్రయాణిస్తున్న సమయంలో.. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘‘నేను భారత్‌కు చాలా దగ్గర, పాకిస్థాన్‌కు కూడా చాలా దగ్గరివాడిని. కశ్మీర్‌లో ఆ రెండు దేశాలు వెయ్యి ఏళ్లుగా పోరాడుతున్నాయి. ఆ ఉగ్రవాద దాడి చాలా దారుణం. రెండు దేశాల మధ్య బహుశా 1,500 ఏళ్లుగా సరిహద్దుల సమస్య కొనసాగుతోందనుకుంటా’’ అని ట్రంప్ బదులిచ్చారు. అఖండ భారతం నుంచి పాకిస్థాన్ విడిపోయి 75 ఏళ్లే అవుతోందని, వెయ్యేళ్లు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్