Share News

Trump: సుంకాలు సున్నాకు తగ్గించేందుకు భారత్‌ ముందుకొచ్చింది

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:31 AM

భారత్‌ను లక్ష్యంగా చేసుకొని నిరాధార వ్యాఖ్యలతో పలుచనువుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, మనదేశంపై విధించిన అధిక సుంకాలను సమర్థించుకుంటూ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.

Trump: సుంకాలు సున్నాకు తగ్గించేందుకు భారత్‌ ముందుకొచ్చింది

న్యూయార్క్‌/వాషింగ్టన్‌, సెప్టెంబరు 1: భారత్‌ను లక్ష్యంగా చేసుకొని నిరాధార వ్యాఖ్యలతో పలుచనువుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, మనదేశంపై విధించిన అధిక సుంకాలను సమర్థించుకుంటూ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. సుంకాలను సున్నాకు తగ్గించేందుకు భారత్‌ ముందుకొచ్చిందని, అయితే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని ట్రంప్‌ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో ప్రధాని మోదీ సమావేశమైన కొన్నిగంటల్లోనే సోషల్‌ మీడియా వేదికగా ట్రంప్‌ ఓ పోస్టు పెట్టారు. భారత్‌తో అమెరికా చాలా తక్కువగా వ్యాపారసంబంధాలు కలిగి ఉందని కొందరు అనుకుంటారని.. అయితే అమెరికాలో భారత్‌ భారీస్థాయిలో వ్యాపారం చేస్తోందని ట్రంప్‌ చెప్పారు. వాణిజ్యపరంగా భారత్‌కు అమెరికా అతిపెద్ద కొనుగోలుదారు (బిగ్గెస్ట్‌ క్లయింట్‌) అని పేర్కొన్నారు. అమెరికాలో భారత్‌ భారీగా వస్తువులను విక్రయిస్తోందని, అమెరికా మాత్రం భారత్‌ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా అక్కడ వస్తువులను విక్రయించలేకపోతోందని.. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగోందని పేర్కొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 01:31 AM