Tributes Paid to Tejas Pilot: తేజస్ పైలెట్ నమన్ష్ సియోల్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:46 AM
దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ వైమానిక విన్యాసాలలో యుద్ధవిమానం తేజస్ ఎంకే 1 కూలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పైలెట్ వింగ్ కమాండర్...
చెన్నై, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ వైమానిక విన్యాసాలలో యుద్ధవిమానం తేజస్ ఎంకే 1 కూలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పైలెట్ వింగ్ కమాండర్ నమన్ష్ సియోల్ భౌతికకాయానికి కోయంబత్తూరులోని సూలూరు వైమానిక దళం వద్ద ఆదివారం అధికారులు, సిబ్బంది ఘననివాళుర్పించారు. నమన్ష్ సియోల్ సూలూరు వైమానిక దళంలోనే పనిచేస్తున్నారు. అక్కడి వైమానిక దళం క్వార్టర్స్‌లోనే భార్యతోపాటు నివసిస్తున్నారు. ఆమె వైమానిక దళం అధికారిగా ఉన్నారు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. నమన్స్ సియోల్ భౌతికకాయాన్ని దుబాయ్ నుంచి విమానంలో శనివారం రాత్రి సూలూరు వైమానిక దళానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత యాన్ని ప్రత్యేక విమానంలో నమన్ష్ సియోల్ స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా గ్రామానికి తీసుకెళ్లారు.