Tribal Woman: నిర్భయ ఘటనను తలపించేలా మరో ఘాతుకం. మహిళను అత్యంత దారుణంగా..
ABN , Publish Date - May 25 , 2025 | 10:00 PM
Tribal Woman: శనివారం ఉదయం గ్రామంలోని ఓ ఇంటి వెనుక బాధితురాలు ఆపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కొందరు మహిళలు గమనించారు. వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గులు ఆమె శరీరంతో అత్యంత దారుణంగా వ్యవహరించారు. ప్రాణం ఉన్న మనిషి అని కూడా ఆలోచించకుండా క్రూరంగా ప్రవర్తించారు. ఐరన్ రాడ్డుతో ఆమెపై దాడి చేయటమే కాకుండా.. దాన్ని ఆమె మర్మాంగంలో జొప్పించారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయి బాధితురాలు మరణించింది. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాండ్వా జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లికి స్థానికులతో పాటు, సమీప గ్రామ ప్రజలు కూడా హాజరయ్యారు. బాధితురాలు కూడా తన కుటుంబంతో కలిసి వివాహానికి హాజరైంది. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా అదృశ్యమైంది. శనివారం ఉదయం గ్రామంలోని ఓ ఇంటి వెనుక బాధితురాలు ఆపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కొందరు మహిళలు గమనించారు. వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహిళ ఇద్దరు కుమారులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. తనపై జరిగిన ఉదంతాన్ని చెప్పేలోపే బాధితురాలు తుదిశ్వాస విడిచింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్డు జొప్పించి గర్భాశయం బయటకు తీసినట్లు డాక్టర్లు వెల్లడించారు. అధిక రక్తస్రావం కారణంగా మహిళ మరణించినట్లు తెలిపారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
Sheikh Hasina: మహ్మద్ యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడు.. మాజీ ప్రధాని షేక్ హసీనా..
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..