Pahalgam terror attack: పహల్గాం దాడి మా పని కాదు
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:04 AM
పహల్గాం ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదని టీఆర్‌ఎఫ్ బుకాయించింది. తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను హ్యాక్ చేసి భారత నిఘా సంస్థలు నెపం మోపాయని ఆరోపించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తమ పని కాదంటూ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా(ఎల్‌ఈటీ) అనుబంధ సంస్థ ద రెస్టిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్‌ఎఫ్) బుకాయించింది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలకు టెలిగ్రామ్ ద్వారా సందేశాలు పంపింది. తమ అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్ హ్యాకింగ్ గురైందని బుకాయిస్తూ.. భారతీయ నిఘా సంస్థలపై నెపాన్ని మోపింది. హ్యాకింగ్ ఉదంతంపై అంతర్గత ఆడిట్ చేస్తున్నామని, త్వరలో నిజాలను వెల్లడిస్తామని వివరించింది.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్