Share News

Assam: ఏనుగుల గుంపును ఢీకొట్టిన రైలు

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:22 AM

అసోంలో రైలు ప్రమాదం సంభవించింది. రైలు ఢీకొని ఏడు ఏనుగులు మృతిచెందాయి.

Assam: ఏనుగుల గుంపును ఢీకొట్టిన రైలు

  • అసోంలో ఘటన..7 ఏనుగుల మృతి

  • పట్టాలు తప్పిన 5బోగీలు

గుహవాటి, డిసెంబరు 20: అసోంలో రైలు ప్రమాదం సంభవించింది. రైలు ఢీకొని ఏడు ఏనుగులు మృతిచెందాయి. ఒక ఏనుగు గాయపడింది. హోజాయ్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:17 గంటలకు సాయిరంగ్‌-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకెళుతుండగా పట్టాలపై ఏనుగులు అడ్డంగా వచ్చాయి. కో-పైలట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినా అప్పటికే ఆలస్యమైంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం ఫలితంగా ఆ మార్గంలోని రైళ్లలో కొన్నింటిని రద్దు చేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాలని రాష్ట్ర అటవీశాఖ అధికారులను అసోం సీఎం బిశ్వశర్మ ఆదేశించారు. ఏనుగుల మృతిపట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన జీవాల్లో మూడు పెద్ద ఏనుగులు, నాలుగు పిల్లలు ఉన్నాయి.

Updated Date - Dec 21 , 2025 | 06:24 AM