Share News

Kolkata Fire Accident: కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం 14మంది దుర్మరణం

ABN , Publish Date - May 01 , 2025 | 05:18 AM

కోల్‌కతాలోని బుర్రాబజార్‌లో ఉన్న రితురాజ్‌ హోటల్‌లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా 14 మంది మృతి చెందగా, 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Kolkata Fire Accident:  కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం 14మంది దుర్మరణం

కోల్‌కతా, ఏప్రిల్‌ 30: కోల్‌కతాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సెంట్రల్‌ కోల్‌కతాలోని ఓ హోటల్‌(లాడ్జి)లో మంగళవారం సాయంత్రం మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు సహా 14 మంది దుర్మరణం చెందారు. మరో 13 మంది ఆస్పత్రిపాలవ్వగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. నగరంలోని ప్రముఖ హోల్‌సేల్‌ మార్కెట్‌ అయిన బుర్రాబజార్‌లోని ఇరుకైన సందుల్లో ఉన్న రితురాజ్‌ హోటల్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆరు అంతస్తులలో ఉన్న రితురాజ్‌ హోటల్‌లోని 42 గదుల్లో ప్రమాదం జరిగిన సమయంలో 88 మంది అతిథులు ఉన్నారు. అయితే, ఏం జరిగిందో తెలియదు కానీ మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల తర్వాత హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో భవనం అంతా వ్యాపించాయి. హోటల్‌లో నుంచి బయటికి వచ్చేందుకు భవనంలో ఒకేఒక్క సన్నని మెట్ల మార్గం ఉండడంతో చాలామంది బయటికి రాలేక లోపలే ఇరుక్కుపోయారు. కొందరు భవనంపైకి ఎక్కారు. అయితే, అగ్నికీలలు చెలరేగతుండడం, భవనం అంతా పొగ వ్యాపించడంతో.. కాలిన గాయాలతో కొందరు, పాగ వల్ల ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని కీలల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనం కిటికీల్లోంచి కిందికి దూకి చనిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 05:18 AM