Share News

Actor Vijay: విజయ్‌తో తమిళనాడు కాంగ్రెస్‌ నేత భేటీ!

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:03 AM

డీఎంకేతో ఎంత స్నేహంగా ఉన్నా అధికారంలో భాగస్వామ్యం ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్‌ అసంతృప్తిగా ఉందా?.

Actor Vijay: విజయ్‌తో తమిళనాడు కాంగ్రెస్‌ నేత భేటీ!

చెన్నై, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): డీఎంకేతో ఎంత స్నేహంగా ఉన్నా అధికారంలో భాగస్వామ్యం ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్‌ అసంతృప్తిగా ఉందా?.. అందుకే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రముఖ సినీ నటుడు విజయ్‌తో కలిసి ఎదుర్కోవాలని భావిస్తోందా?.. అవుననే అంటున్నాయి తమిళ రాజకీయవర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 40 స్థానాలు కావాలంటూ గత బుధవారం టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గిరీష్‌ శోడంకర్‌ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కోరారు. అయితే, ఆ భేటీ జరిగిన 48 గంటల్లోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి సన్నిహితునిగా పేరుగాంచిన ప్రవీణ్‌ చక్రవర్తి టీవీకే అధినేత విజయ్‌తో రహస్యంగా భేటీ కావడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. శుక్రవారం స్థానిక పట్టినబాక్కంలోని టీవీకే కార్యాలయానికి వెళ్లిన ప్రవీణ్‌ చక్రవర్తి.. విజయ్‌తో గంటకు పైగా భేటీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ అడిగినన్ని స్థానాలు ఇచ్చేందుకు స్టాలిన్‌ సుముఖంగా లేరు. కాంగ్రె్‌సకు 20-25 శాసనసభ స్థానాలు మాత్రం ఇవ్వాలని స్టాలిన్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Dec 06 , 2025 | 04:03 AM