K S Venugopal: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లకు ప్రశంస
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:49 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ, ఈబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ సమావేశం ప్రశంసించింది...
దీనిపై ప్రత్యేక తీర్మానం చేశాం: కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ, ఈబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ సమావేశం ప్రశంసించింది. ఈ మేరకు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించినట్టు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తొలుత తెలంగాణకే దక్కిందన్నారు. సీడబ్ల్యూసీ భేటీలో దేశ రాజకీయ పరిస్థితిపై జైరాం రమేశ్, బిహార్‌లో పరిస్థితిపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేశ్‌రామ్ తీర్మానాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పునర్ వ్యవస్థీకరణ, ఓట్ చోరీ అంశంపై విస్తృతంగా చర్చించామన్నారు.