Telangana Bhavan: ఢిల్లీలో తెలంగాణ హెల్ప్‌లైన్
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:50 AM
నేపాల్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నేపాల్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్‌లో ఉంటున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు తమకు ఏదైనా సహాయం కావాలంటే తెలంగాణ భవన్ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్(లైజన్ హెడ్) వందన(98719 99044), లైజన్ ఆఫీసర్ రక్షిత్(96437 23157), ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ చక్రవర్తి(99493 51270) తమతమ ఫోన్ నెంబర్లలో అందుబాటులో ఉంటారని పేర్కొంది. బుధవారం వరకు అందిన సమాచారం ప్రకారం నేపాల్‌లోని తెలంగాణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించింది.