Share News

Telangana DGP Shivadhar Reddy: డీజీపీ శివధర్‌రెడ్డికి గ్రీన్‌ ఎనర్జీ సర్టిఫికెట్‌

ABN , Publish Date - Dec 10 , 2025 | 03:03 AM

రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డికి గ్రీన్‌ ఎనర్జీ సర్టిఫికెట్‌ లభించింది. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంగళవారం ఆయన సందర్శించారు.....

Telangana DGP Shivadhar Reddy: డీజీపీ శివధర్‌రెడ్డికి గ్రీన్‌ ఎనర్జీ సర్టిఫికెట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డికి గ్రీన్‌ ఎనర్జీ సర్టిఫికెట్‌ లభించింది. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఎనర్జీ, నెట్‌ జీరో ఎనర్జీపై నిర్వహించిన క్విజ్‌ పోటీలో ఆయన పాల్గొన్నారు. క్విజ్‌లో అడిగిన పది ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు ఇచ్చారు. దీంతో డీజీపీకి నిర్వాహకులు గ్రీన్‌ ఎనర్జీ చాంపియన్‌ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. అనంతరం ఘట్కేసర్‌ గురుకుల పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫైన్‌ ఆర్ట్స్‌ స్టాల్‌ను శివధర్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా తొమ్మిదో తరగతి విద్యార్థి ఎ.భగవేందర్‌ ఆయన చిత్రపటాన్ని గీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన ఈ బాలుడి కళా నైపుణ్యాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి అభినందించారు.

Updated Date - Dec 10 , 2025 | 03:03 AM