Share News

Deputy CM Mallu Bhatti: ఝార్ఖండ్‌ సీఎంకు భట్టి పరామర్శ

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:38 AM

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాంచీలో ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో భేటీ అయ్యారు...

Deputy CM Mallu Bhatti: ఝార్ఖండ్‌ సీఎంకు భట్టి పరామర్శ

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాంచీలో ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో భేటీ అయ్యారు. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు, హేమంత్‌ సోరెన్‌ తండ్రి శిబూ సోరెన్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల భట్టి తన సంతాపాన్ని ప్రకటించారు. ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. జేఎంఎం, కాంగ్రెస్‌ కూటమి ఆ ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా ఝార్ఖండ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు.

Updated Date - Sep 11 , 2025 | 05:38 AM