Shabarimala temple Gold Theft: శబరిమల బంగారం చోరీపైరెండో కేసులో ఉన్నికృష్ణన్ అరెస్టు
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:35 AM
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారం చోరీ సంఘటనకు సంబంధించి నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టిని సోమవారం పోలీసులు మరో కేసులో...
ద్వారాల పుత్తడి కూడా అపహరించినట్టు ఆరోపణ
పథనంథిట్ట, నవంబరు 3: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారం చోరీ సంఘటనకు సంబంధించి నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టిని సోమవారం పోలీసులు మరో కేసులో అరెస్టు చేశారు. గతంలో ద్వారపాలక విగ్రహాల తొడుగులకు ఉన్న బంగారాన్ని మాయం చేశారన్న కేసులో అరెస్టు చేయగా, ప్రస్తుతం ద్వారబంధాలకు ఉన్న పుత్తడినీ అపహరించారన్న కేసులో అరెస్టు చేశారు. శ్రీకోవిల్‌లో ఉన్న బంగారం రేకులకు మరమ్మతులు చేయిస్తానని, అందుకు ప్రాయోజకుడిగా వ్యవహరిస్తానని చెప్పి పుత్తడిని అపహరించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఉన్నికృష్ణన్‌ను సోమవారం రన్నీలోని కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం పది రోజుల కస్టడీకి పంపించింది.