Crop Waste Burning: రైతుల్లో కొందరిని అరెస్టు చేస్తేగానీ పంట వ్యర్థాల దహనం మానరు
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:15 AM
దేశ రాజధానిలోని కాలుష్యంపై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పొలాల్లో పంట దుబ్బులను కాల్చడం కారణంగా కాలుష్యం పెరుగుతుండడాన్ని...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: దేశ రాజధానిలోని కాలుష్యంపై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పొలాల్లో పంట దుబ్బులను కాల్చడం కారణంగా కాలుష్యం పెరుగుతుండడాన్ని తీవ్రంగా పరిగణించింది. అలా చేస్తున్న కొందర్ని జైల్లో వేస్తేనే రైతులకు సరైన సందేశం వెళ్తుందని అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ మాట్లాడుతూ ‘‘రైతులు ప్రత్యేకమైనవారు, కాదనడం లేదు. వారి కారణంగానే అన్నం తింటున్నాం. అలాగని పర్యావరణాన్ని రక్షించకుండా ఉండలేం’’ అని అభిప్రాయపడ్డారు. రైతులపైనా జరిమానాలు వేసే నిబంధనలు గురించి ఆలోచించాలని అన్నారు. పంట వ్యర్థాలను జీవ ఇంధనంగా తయారు చేసే అవకాశం ఉన్నా దీన్ని అయిదేళ్ల కార్యక్రమంగా చేపట్టలేకపోయారని అన్నారు. కేంద్ర, యూపీ, రాజస్థాన్, హరియాణా, పంజాబ్ కాలుష్య నివారణ మండళ్లు, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను మూడు నెలల్లో భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.