Share News

Supreme Court Rules Reserved Category: మినహాయింపులు పొందినరిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు జనరల్‌ కోటాకు అర్హులు కాదు

ABN , Publish Date - Sep 12 , 2025 | 03:43 AM

వయసు, విద్య తదితర అంశాల్లో మినహాయింపు పొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జనరల్‌ కోటా ఉద్యోగాలకు అర్హులు కాదని...

Supreme Court Rules Reserved Category: మినహాయింపులు పొందినరిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు జనరల్‌ కోటాకు అర్హులు కాదు

  • సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: వయసు, విద్య తదితర అంశాల్లో మినహాయింపు పొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జనరల్‌ కోటా ఉద్యోగాలకు అర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో వారికి జనరల్‌ కోటా ఉద్యోగాలు ఇవ్వలేరని తెలిపింది. రిజర్వు కోటాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసి, వయసు వంటి అర్హతల్లో మినహాయింపులు పొందినవారు అనంతరం తమకు జనరల్‌ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వాలని అడగలేరని తెలిపింది. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) ఉద్యోగాలకు రిజర్వుడు కోటా కింద దరఖాస్తు చేసిన వారికి జనరల్‌ కోటాలో పోస్టులు ఇవ్వాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాలా బాగ్చీ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - Sep 12 , 2025 | 03:43 AM