Share News

SC Issues Notice to CM Siddaramaiah: సిద్దరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసు

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:06 AM

కర్ణాటక సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్‌కు స్పందించిన సుప్రీంకోర్టు ఆయనకు సోమవారం నోటీసులు జారీ చేసింది.....

SC Issues Notice to CM Siddaramaiah: సిద్దరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసు

బెంగళూరు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): కర్ణాటక సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్‌కు స్పందించిన సుప్రీంకోర్టు ఆయనకు సోమవారం నోటీసులు జారీ చేసింది. మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గం నుంచి 2023లో సిద్దరామయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని శంకర్‌ అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ విక్రమనాథ, జస్టిస్‌ సందీప్‌ మెహతా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను సోమవారం విచారించింది. దీనికి బదులివ్వాలని సీఎం సిద్దరామయ్యతో పాటు ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Dec 09 , 2025 | 03:06 AM