Supreme Court: తీర్పుల వివరాలన్నీ వెల్లడించాలి
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:04 AM
న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు...
వెబ్‌సైట్లలో డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలి
అన్ని హైకోర్టులనూ ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబరు 12: న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు తమతమ వెబ్‌సైట్లలో ఒక డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేసి, అందులో తీర్పుల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 31 తర్వాత రిజర్వ్ చేసిన తీర్పులు, వెల్లడించిన తీర్పులు, అప్‌లోడ్ చేసిన తేదీలతో సహా డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిల ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఝార్ఖండ్ హైకోర్టు సహా పలు హైకోర్టులు సివిల్, క్రిమినల్ కేసుల్లో తుది వాదనలు పూర్తయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి తీర్పులు ఇవ్వకపోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే తీర్పుల వివరాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.