Supreme Court Declines: మీరు పరమభక్తులంటున్నారు కదా..వెళ్లి విష్ణువునే ప్రార్థించండి
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:18 AM
ఖజురహోలోని జావరీ ఆలయంలో మొఘలుల కాలంలో విధ్వంసానికి గురైన 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైనపిటిషన్‌ను విచారించడాని...
ఖజురహోలో విష్ణుమూర్తి విగ్రహ పునరుద్ధరణ కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ఖజురహోలోని జావరీ ఆలయంలో మొఘలుల కాలంలో విధ్వంసానికి గురైన 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైనపిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాకేశ్ దలాల్ అనే వ్యకి ఈ పిటిషన్ వేశారు. మొఘలుల దండయాత్రల్లో ఆ విగ్రహం తల నరికారని.. దాన్ని పునరుద్ధరించాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీం సీజే జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజే మాసి్‌హతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ రాగా.. ఈ అంశం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎ్‌సఐ) పరిధిలో ఉందని పేర్కొంటూ దాన్ని విచారించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. ఈ సందర్బంగా జస్టిస్ గవాయ్.. ‘‘మీరు విష్ణుమూర్తికి పరమభక్తులని చెబుతున్నారు కదా.. వెళ్లి దీనిపై ఏదైనా చేయాలని ఆ దేవుణ్నే అడగండి. వెళ్లి ప్రార్థించండి’’ అని పిటిషనర్‌కు సలహా ఇచ్చారు. ‘‘అది భారత పురావస్తు శాఖకు చెందిన స్థలం. కాబట్టి అక్కడేమైనా చెయాలంటే ఏఎ్‌సఐ అనుమతి ఇవ్వాలి. సారీ’’ అన్నారు