Supreme Court: రేప్ కేసుల విచారణలో జడ్జిల అనుచిత వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:07 AM
అత్యాచార కేసుల విచారణ సందర్భంగా జడ్జీలే బాధితుల పట్ల సున్నితత్వం లేని వ్యాఖ్యలు చేస్తుండడాన్ని సోమవారం సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.....
న్యూఢిల్లీ, డిసెంబరు 8: అత్యాచార కేసుల విచారణ సందర్భంగా జడ్జీలే బాధితుల పట్ల సున్నితత్వం లేని వ్యాఖ్యలు చేస్తుండడాన్ని సోమవారం సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి మాటలు బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులు, మొత్తం సమాజాన్నే వణికిస్తాయని తెలిపింది. ఇటువంటి సంఘటనలన్నింటినీ పరిశీలించి హైకోర్టులు, ట్రయల్ కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. మార్చి 17న అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఽసుమోటోగా జరుపుతున్న విచారణ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. మైనర్ బాలిక స్థనాలను తాకడం, ఆమె పైజామా తాడు లాగడం, లోదుస్తులను లాగడానికి ప్రయత్నించడాన్ని అత్యాచార ప్రయత్నాలుగా పరిగణించలేమంటూ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొనడంపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి కొందరు న్యాయవాదులు మరికొన్ని ఉదంతాలను తీసుకెళ్లారు. సీనియర్ న్యాయవాది శోభా గుప్తా మాట్లాడుతూ ‘రాత్రి వేళ సంఘటన జరిగిందంటే.. బాఽధితురాలు నిందితుడ్ని ఆహ్వానించినటే’్టనని మరో కేసులో ఇదే హైకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించిందని తెలిపారు. అన్నింటినీ పరిశీలించి సమగ్రంగా మార్గదర్శకాలు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.