Cancels Bail of Gangster Chhota Rajan: గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ బెయిల్ రద్దు
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:13 AM
హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను బుధవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను బుధవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ గత ఏడాది అక్టోబరు 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ చేసిన వినతిని అంగీకరించింది. 2001లో ముంబయికి చెందిన హోటల్ యాజమాని జయా శెట్టిని హత్య చేసిన కేసులో రాజన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2024లో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. అయితే బాంబే హైకోర్టు ఆ శిక్షను రద్దు చేయడంతో పాటు, వేరే కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న అతడికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ సీబీఐ చేసిన అప్పీలుపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. 27 ఏళ్ల పాటు పరారీలో ఉండి, నాలుగు కేసుల్లో శిక్ష పడ్డ ముద్దాయిని విడుదల చేయడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది.