Share News

VANPIC case: వాన్‌పిక్‌ కేసు విచారణ 8 వారాలకు వాయిదా

ABN , Publish Date - May 22 , 2025 | 06:16 AM

మాజీ సీఎం జగన్‌కు సంబంధించిన వాడరేవు, నిజాంపట్నం పోర్ట్స్‌ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్‌ ప్రాజెక్టుల భూముల కేసును సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌పై విచారణ వేసవి సెలవుల తర్వాత జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.

VANPIC case: వాన్‌పిక్‌ కేసు విచారణ 8 వారాలకు వాయిదా

వేసవి సెలవుల తర్వాత విచారిస్తామన్న సుప్రీం

న్యూఢిల్లీ, మే 21(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో భాగమైన.. వాడరేవు, నిజాంపట్నం పోర్ట్స్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ప్రాజెక్ట్స్‌(వాన్‌పిక్‌) భూముల కేసును సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చడంపై వైసీపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును గతేడాది మే 30న ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ వ్య్యాం బుధవారం జస్టిస్‌ జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవుల తర్వాత కేసు విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 06:16 AM