Sunita Williams: సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం
ABN , Publish Date - Mar 14 , 2025 | 06:09 AM
దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)లో ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యం కానుంది.

సాంకేతిక సమస్యలతో నాసా-స్పేస్ ఎక్స్ క్రూ10 ప్రయోగం వాయిదా
నేటి ఉదయం మరోసారి ప్రయోగానికి ఏర్పాట్లు
న్యూఢిల్లీ, మార్చి 13: దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)లో ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యం కానుంది. సునీతతోపాటు ఐఎ్‌సఎ్‌సలో ఉన్న బచ్ విల్మోర్‌ను భూమికి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్‌ఎక్స్ గురువారం తలపెట్టిన క్రూ-10 మిషన్ సాంకేతిక సమస్యల వల్ల వాయిదా పడింది. ఈ ప్రయోగంలో భాగంగా నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ రాకెట్ సాయంతో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ఐఎ్‌సఎ్‌సకు పంపాలని అనుకున్నారు.
ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో బయలుదేరే నలుగురు వ్యోమగాములు సునీత, విల్మోర్ స్థానంలో ఐఎ్‌సఎ్‌సలో బాధ్యతలు చేపడతారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి19న సునీత, విల్మోర్ అదే స్పేస్‌క్రా్‌ఫ్టలో భూమికి తిరుగుప్రయాణం కావాల్సి ఉంది. కానీ, సాంకేతిక సమస్యలు, డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించే మార్గంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల గురువారం తలపెట్టిన ప్రయోగం ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. భారత కాలమా నం ప్రకారం శుక్రవారం ఉదయం 4.33 గంటలకు క్రూ-10 ప్రయోగాన్ని మరోసారి చేపట్టాలని నాసా, స్పేస్‌ఎక్స్ నిర్ణయించాయి