SpiceJet Aviation Accident: టేకాఫ్ సమయంలో ఊడిన విమాన చక్రం
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:02 AM
స్పైస్‌జెట్ విమానానికి శుక్రవారం ఘోర ప్రమాదం తప్పింది. ముంబైకి రావాల్సిన స్పైస్‌జెట్ క్యూ400 విమానం గుజరాత్‌లోని కాండ్లా విమానాశ్రయంలో...
ముంబై, సెప్టెంబరు 12: స్పైస్‌జెట్ విమానానికి శుక్రవారం ఘోర ప్రమాదం తప్పింది. ముంబైకి రావాల్సిన స్పైస్‌జెట్ క్యూ400 విమానం గుజరాత్‌లోని కాండ్లా విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా వెనుకభాగంలో ఉండే కుడి చక్రం ఊడిపోయింది. దీంతో ఏమవుతుందోనని విమానంలోని 75 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. మధ్యాహ్నం 3.51 గంటలకు విమానం అత్యవసర లాండింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.