SP Leader Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:04 AM
డబుల్ పాన్ కార్డు కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది...
డబుల్ పాన్ కార్డు కేసులో ఆయన కుమారుడికి కూడా
రాంపూర్, నవంబరు 17: డబుల్ పాన్ కార్డు కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది. అబ్దుల్లా ఆజం అసలు పుట్టిన తేదీ 1993 జనవరి 1వ తేదీ కాగా, ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వయసు అడ్డంకిగా మారింది. దీంతో అప్పటికే ఉన్న పాన్ కార్డును పక్కనపెట్టి.. 1990 సెప్టెంబరు 30న జన్మించినట్లు తప్పుడు పత్రాలు చూపి మరో పాన్ కార్డు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన గెలుపొందారు. దీనిపై బీజేపీ నేత ఆకాశ్ సక్సేనా 2019లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్దుల్లా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు పాన్ నంబర్ ఇచ్చారని.. ఆజంఖానే తన కొడుకును ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కుట్ర చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక 77 ఏళ్ల ఆజంఖాన్‌పై భూకబ్జా, అవినీతి, మోసం, మేకల దొంగతనం వంటి మొత్తం 84 కేసులున్నాయి.