Share News

MGNREGA: ఉపాధి నిధుల్లో అధికం దక్షిణాదికే!

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:57 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద దక్షిణాది రాష్ట్రాలు అంచనాలకు మించి అధికంగా ఖర్చుపెడుతున్నాయని కేంద్ర....

MGNREGA: ఉపాధి నిధుల్లో అధికం దక్షిణాదికే!

  • అంచనాలకు మించి కేంద్రానికి క్లెయిమ్‌లు

  • ఇందులో తమిళనాడు, కర్ణాటక టాప్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 18: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద దక్షిణాది రాష్ట్రాలు అంచనాలకు మించి అధికంగా ఖర్చుపెడుతున్నాయని కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రధానంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక.. కేంద్రానికి సమర్పించిన అంచనాల కంటే ఎక్కువ క్లెయిమ్‌లు పెడుతున్నాయని తెలిపారు. దీనివల్లే ఆ పథకంలో మోదీ సర్కా రు సమూల మార్పులు చేసిందని.. దాని స్థానంలో ‘వికసిత్‌ భారత్‌: గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌ (జీ-రామ్‌-జీ)’ బిల్లు తీసుకొచ్చిందని వెల్లడించారు. గురువారం ఈ బిల్లును విపక్ష ఎంపీల గందరగోళం నడుమ లోక్‌సభ ఆమోదించింది. శుక్రవారం రాజ్యసభ ఆమోదించే అవకాశముంది.

Updated Date - Dec 19 , 2025 | 03:57 AM