Special Court Notice: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లకు నోటీసులు
ABN , Publish Date - May 03 , 2025 | 04:51 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వారి పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది.
న్యూఢిల్లీ, మే 2: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు శుక్రవారం ఇక్కడి ప్రత్యేక కోర్టు నోటీసులు పంపించింది. నేషనల్ హెరాల్డ్‌కు చెందిన స్థిరాస్తుల బదలాయింపులో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వారిపై కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే...నిందితులకు వాదన వినిపించే హక్కు ఉందని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఏ దశలోనయినా వినిపించే హక్కు కలిగించడం న్యాయమైన విచారణకు ఊపిరిపోస్తుందని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను ఈ నెల ఎనిమిదో తేదీకి వాయుదా వేశారు. మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల బదలాయింపులో కాంగ్రెస్ నాయకులు క్రిమినల్ కుట్రకు, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి 2014లో ప్రయివేటు క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేశారు. 2021 నుంచి ఈడీ దీనిపై దర్యాప్తు చేస్తోంది.
ఇవి కూడా చదవండి..