Share News

Honeymoon Murder: రాజా హత్య తర్వాత సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్టింగ్.. సోనమ్ మరో సంచలనం

ABN , Publish Date - Jun 10 , 2025 | 08:16 PM

హత్య కేసులో కీలక నిందితురాలు, అతని భార్య సోనమ్ పోలీసులను తప్పదారి పట్టించే ప్రయత్నం చేసినట్టు తాజాగా తెలిసింది. రాజా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆమె ఒక పోస్టింగ్ పెట్టడం దర్యాప్తు అధికారులు గుర్తించారు.

Honeymoon Murder: రాజా హత్య తర్వాత సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్టింగ్.. సోనమ్ మరో సంచలనం

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్య కేసులో కీలక నిందితురాలు, అతని భార్య సోనమ్ పోలీసులను తప్పదారి పట్టించే ప్రయత్నం చేసినట్టు తాజాగా తెలిసింది. రాజా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆమె ఒక పోస్టింగ్ పెట్టడం దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మే 25న బాయ్‌ఫ్రెండ్ లవర్ రాజ్ కుష్వాహను కలుసుకునేందుకు రైలులో సిలిగురి మీదాగా షిల్లాంగ్ నుంచి ఇండోర్ ఆమె ప్రయాణించింది.


మే 11న రాజా, సోనమ్ వివాహం జరుగగా, మే 20న హనీమూన్ ట్రిప్ కోసం ఇద్దరూ మేఘాలయ వచ్చారు. 23 నుంచి కనిపించకుండా పోయారు. జూన్ 2న రాజా మృతదేహం సోహ్రా ఏరియాలోని ఓ లోతైన లోయలో కనిపించింది. సోనమ్ తన బాయ్‌ఫ్రెండ్‌ సహాయంతో రాజాను చంపేందుకు కుట్ర పన్నిందని, ఈ ఇద్దరూ కలిసి రాజ్ హత్య కోసం కాంట్రాక్టు హంతకులను కుదుర్చుకున్నానని పోలీసులు వెల్లడించారు. సోనమ్, రాజ్ కుష్హాహ, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.


కేసులో కీలక పరిణామాలు ఇవే..

1.రాజా రఘవీంశీని హత్య చేసిన అనంతరం సోనమ్ అతని సోషల్ మీడియా అకౌంట్ నుంచి 'సాత్ జన్మోం కా సాథ్ హై' అంటూ పోస్టింగ్ పెట్టింది. తద్వారా తన భర్త బతికే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. హనీమూన్ సమయంలో సోనం ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ పోస్ట్ చేయలేదు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు.

2.రాజా హత్య అనంతరం నేరం జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో సోనమ్ ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో వెల్లడైంది.

3.మే 25న సోనమ్ తన బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకునేందుకు రైలులో సిలిగురి మీదుగా షిల్లాంగ్ నుంచి ఇండోర్ బయలుదేరింది. ఆ తర్వాత వారణాసి మీదుగా ఘాజీపూర్ చేరుకుంది. తన జాడ తెలియకుండా మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసింది. హత్యకు ఉపయోగించిన ఆయుదాన్ని గౌహతి రైల్వే స్టేషన్ సమీపంలో సేకరించినట్టు తెలుస్తోంది.

4.హత్య జరిగిన స్థలం నుంచి నిందితుల్లో ఒకరైన ఆకాష్‌కు చెందిన జాకెట్ దొరికింది. సోనమ్‌కు చెందిన రెయిన్ కోట్, రాజా ఫోన్ స్క్రీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆకాష్‌కు తన రెయిన్ కోటును సోనమ్ ఇచ్చిందని, దానికి రక్తం మరకలు అంటుకోగా దానిని అక్కడ వదిలేశారని చెబుతున్నారు.

5.రాజ్ కుష్వాహకు, సోనమ్‌కు లవ్ ఎఫైర్ ఉన్న విషయం సోనమ్ తల్లికి తెలుసునని, ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టిందని హతుడు రాజ్ సోదరుడైన విపిన్ రఘువంశి తెలిపారు. వాళ్లు అనుకున్నటే ఆ ఇద్దరికీ పెళ్లి చేస్తే తన సోదరుడు హత్యకు గురయ్యేవాడు కాదని అన్నారు.

6. రాజా అంత్యక్రియలకు హాజరైన కొందరిని తన వాహనంలోనే రాజ్ కుష్వాహ తీసుకువచ్చినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు,

7.రాజ్ హత్యను దొంగతనం, కిడ్నాప్‌ కేసు కింద భావించేలా సోనమ్, రాజ్ కుష్వాహ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా తనకు డ్రగ్స్ ఇచ్చి ఘాజిపూర్ తీసుకెళ్లినట్టు సోనమ్ పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది. ఇన్వెస్టికేషన్ కథనం ప్రకారం, కుష్వాహను వివాహం చేసుకుంటానని సోనమ్ హామీ ఇచ్చింది. రాజా మరణం తర్వాత ఆమె పట్ల సానుభూతితో కుష్వాహతో వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకుంటారని, ఆమె తండ్రికి కూడా అభ్యంతరం ఉండకపోవచ్చని సోనమ్-కుష్వాహ ప్లాన్‌గా ఉంది.

8.రాజా హత్య కోసం ఒక చిన్న గొడ్డలికి గౌహతిలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చారు. ఫోటోషూట్ పేరుతో రాజాను హత్య చేసేందుకు కోర్సా ఏరియాకు సోనమ్ అతనిని మే 23న తీసుకువచ్చిందని, అక్కడ సోనం పర్స్ నుంచి రూ.15,000 కిరాయి హంతకులకు ఆమె ఇచ్చిందని, చెప్పిన పని పూర్తి చేశాక రూ.20,000 రివార్డుగా ఇస్తానని కూడా ఆశ చూపించదని పోలీసులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం.. కర్ణాటక సర్కార్‌‌కు 9 ప్రశ్నలు

నాకు డ్రగ్స్ ఇచ్చారు.. పోలీసుల విచారణలో సోనమ్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 09:28 PM