Share News

Pahalgam terror attack: పహల్గాం పాపం పాకిస్థాన్‌దే

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:13 AM

పహల్గాం దాడికి పాక్‌ ఆర్మీ నేరుగా పాల్పడినట్టు ఎన్‌ఐఏ కీలక ఆధారాలు వెల్లడించింది. పాక్‌ కమాండోగా పని చేసిన హషీమ్‌ మూసా పేరే మూడు దాడులకూ లింక్‌ కావడం గమనార్హం. ఇప్పటికైనా కశ్మీర్‌లో sleeper cells చైతన్యాన్ని ఎదుర్కొనే దశలో ఏమైనా మార్గదర్శక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మీ అభిప్రాయం ఏమిటి?

Pahalgam terror attack: పహల్గాం పాపం పాకిస్థాన్‌దే

దాడిలో పాక్‌ మాజీ పారా కమాండో

మూసా పాల్గొన్నట్టు తాజాగా వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 : పహల్గాం నరమేధం పాకిస్థాన్‌ పాపమేనని భారత్‌ తొలినుంచీ గట్టిగా నమ్ముతోంది. ఇప్పుడు అందుకు గట్టి ఆధారం కూడా దొరికింది. ఇటీవల భద్రతాబలగాల కాల్పుల్లో మరణించిన ఓ ఉగ్రవాది వద్ద హషీమ్‌ మూసా అలియాస్‌ సులేమాన్‌ ఫొటో బయటపడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బాగా వినిపిస్తున్న పేరు మూసా. అయితే, ఇతడు గతంలో పాకిస్థాన్‌ ఆర్మీలో ప్రత్యేక బలగాల (ఎస్‌ఎ్‌సజీ) పారా కమాండోగా పనిచేశాడని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో పహల్గాం దాడిలో పాక్‌ ఆర్మీ, ఐఎ్‌సఐకి ఉన్న ప్రత్యక్ష పాత్ర స్పష్టమయిందని ఎన్‌ఐఏ అధికారులను ఉటంకిస్తూ ఓ జాతీయ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. అతడు ప్రస్తుతం ఉగ్ర సంస్థ లష్కరే తాయిబాలో కీలక వ్యక్తిగా ఉన్నాడని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. పారా కమాండోగా ఆయన తీసుకున్న శిక్షణే పహల్గాం దాడి తర్వాత భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడంలో సహకరించిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గతేడాది అక్టోబరులో మధ్య కశ్మీరులోని గగన్‌గీర్‌లో ఏడుగురు కార్మికులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. అదే నెలలో బారాముల్లాలో ఆర్మీ వాహనంపై దాడిచేసి జవాను సహా ఇద్దరిని చంపేశారు.


తాజాగా పహల్గాం ఉగ్రదాడి. ఈ మూడు దాడుల్లోనూ ఉమ్మడిగా వినిపించిన పేరు మూసా. ఈ నేపథ్యంలో, ఈ 3దాడులకు సంబంధం ఉందని ఎన్‌ఐఏ భావిస్తోంది. గతేడాది రెండు ఘటనలకు ఉన్న పోలికలను అప్పుడే నిఘా వర్గాలు గుర్తించి ఉంటే మూడో దాడిని నిలువరించడానికి వీలయ్యేదని ఎన్‌ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడిన మూసాతో పాటు అలీభాయ్‌ ఏడాది క్రితమే భారత్‌లోకి చొరబడినట్లు ఒక నివేదిక పేర్కొంది. ఇదిలా ఉండగా, కశ్మీర్‌లో మరిన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ఇక్కడున్న 87 పర్యాటక ప్రదేశాల్లో 48 ప్రాంతాలను మూసివేసింది. పహల్గాం దాడి తర్వాత కొందరు స్లీపర్‌ సెల్స్‌ కశ్మీర్‌ లోయలో యాక్టివేట్‌ అయినట్టు ఈ వర్గాలు గుర్తించాయి.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 30 , 2025 | 05:13 AM