Share News

Sanjay Kumar: మహారాష్ట్రలో సెఫాలజిస్టు సంజయ్‌పై రెండు కేసులు

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:15 AM

మహారాష్ట్ర ఎన్నికల ఓటర్ల జాబితాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేశారంటూ సెఫాలజిస్టు సంజయ్‌కుమార్‌పై ఆ రాష్ట్ర పోలీసులు 2 కేసులు నమోదు చేశారు.

Sanjay Kumar: మహారాష్ట్రలో సెఫాలజిస్టు సంజయ్‌పై రెండు కేసులు

నాగ్‌పూర్‌/ ముంబై, ఆగస్టు 20: మహారాష్ట్ర ఎన్నికల ఓటర్ల జాబితాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేశారంటూ సెఫాలజిస్టు సంజయ్‌కుమార్‌పై ఆ రాష్ట్ర పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. హింగ్నా, దేవ్‌లలి నియోజకవర్గాల్లో 2024 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య తగ్గిపోయిందంటూ ఆయన కొన్నిరోజుల క్రితం ‘ఎక్స్‌’లో పోస్టుపెట్టారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈసీ, బీజేపీపై ‘ఓటు చోరీ’ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు ఈ డేటాను ఉదాహరణగా చూపాయి. అయితే తన డేటా విశ్లేషణలో పొరపాట్లు జరిగాయని, క్షమాపణ చెబుతున్నానంటూ సంజయ్‌కుమార్‌ మంగళవారం తన పోస్టు తొలగించారు.

Updated Date - Aug 21 , 2025 | 05:15 AM