Share News

Wedding Cancellation: ఇండోర్‌లో 40 రోజుల్లో 150 పెళ్లిళ్లు పెటాకులు

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:47 AM

ఒకప్పుడు పెళ్లి అంటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలనే వారు.. ఇప్పుడా పరిస్థితి లేదు.. ఏ

Wedding Cancellation: ఇండోర్‌లో 40 రోజుల్లో 150 పెళ్లిళ్లు పెటాకులు

  • 60-70 శాతం వివాహాల రద్దుకు సోషల్‌

  • మీడియాలో వ్యవహార శైలే కారణం..

ఇండోర్‌, డిసెంబరు 13: ఒకప్పుడు పెళ్లి అంటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలనే వారు.. ఇప్పుడా పరిస్థితి లేదు.. ఏదేమైనా వివాహం చేసుకునే అమ్మాయి లేదా అబ్బాయి సోషల్‌ మీడియా ఖాతాలు వెతికి పరిశీలిస్తే చాలు.. వారు ఎలాంటి వారో పూర్తిగా ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఈ కారణంగానే పీటల వరకు వచ్చిన పెళ్లిళ్లు సైతం పెటాకులు అవుతున్నాయి. చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 40 రోజుల్లో 150 జంటలు తమ వివాహాలను రద్దు చేసుకున్నాయి. అయితే ఇందులో 60-70ు పెళ్లిళ్లు పెటాకులు కావడానికి కారణం సోషల్‌ మీడియాతోనే ముడిపడి ఉందని ఓ ప్రముఖ హిందీ దినపత్రిక ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. సోషల్‌ మీడియాలో వారి సంబంధాల గురించి చేసిన పాత పోస్టులు, వ్యాఖ్య లు, ఎమోజీలు లేదా వారి స్నేహితుల జాబితాలు కూడా కారణంగా ఉన్నాయి. మిగిలిన పెళ్లిళ్ల రద్దు విషయానికొస్తే కుటుంబ సభ్యుల మరణాలు లేదా ప్రమాదాలు, పరస్పర విభేదాలు, ఊహించని పరిస్థితులకు సంబంధించిన కారణాలున్నాయి. ఇక ఇండోర్‌-గుజరాత్‌కు చెందిన ఓ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ సమయంలో వధువు సోషల్‌ మీడియా ఖాతాలో చేసిన పాత పోస్టులపై గొడవ జరిగి పెళ్లి రద్దయింది.

Updated Date - Dec 14 , 2025 | 04:48 AM