Share News

Chennai: ఒకే డోర్‌ నంబరు.. 177 మంది ఓటర్లు

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:08 AM

ఒకే డోర్‌నంబరులో 177 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఓటు హక్కును...

Chennai: ఒకే డోర్‌ నంబరు.. 177 మంది ఓటర్లు

చెన్నై పెరుంబాక్కం కాలనీలో ఇలాంటి కేసులెన్నో..

చెన్నై, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఒకే డోర్‌నంబరులో 177 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. దీంతో వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది. ఇది తమిళనాడు రాజధాని నగరం చెన్నై శివారు పెరుంబాక్కంలోని పునరావాస కాలనీలోని పరిస్థితి. ఈ కాలనీలో 200 నుంచి 250 వరకు ఉన్న బ్లాకుల్లో 26 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి సంబంధించిన పత్రాలపై సంపూర్ణ చిరునామాలు లేవు. వీరి చిరునామాలను అసంపూర్తిగా, ఇష్టానుసారంగా నమోదు చేశారు. అనేకమంది పత్రాలపై ఒకే చిరునామాలు ము ద్రించారు. దీంతో ఈ ప్రాంతంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.

Updated Date - Nov 17 , 2025 | 04:08 AM