Share News

Singer Maithili Thakur: ఆ స్వరమే.. భాస్వరమై..

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:24 AM

బిహార్‌ రాజకీయాల్లో సరికొత్త సంచలనం..! బీజేపీ తరఫున బరిలో దిగిన ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్‌ అలీనగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు! 2008లో...

Singer Maithili Thakur: ఆ స్వరమే.. భాస్వరమై..

  • ఎమ్మెల్యేగా ఎన్నికైన గాయని మైథిలి

  • అతిపిన్న వయస్కురాలిగా రికార్డు

పట్నా, నవంబరు 14: బిహార్‌ రాజకీయాల్లో సరికొత్త సంచలనం..! బీజేపీ తరఫున బరిలో దిగిన ప్రముఖ గాయని మైథిలి ఠాకూర్‌ అలీనగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు! 2008లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో దాదాపు 50 శాతం ముస్లిం ఓటర్లే ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ గెలవనేలేదు. అలాంటి స్థానం నుంచి పోటీ చేసిన 25 ఏళ్ల మైథిలి ఠాకూర్‌.. ఘన విజయం సాధించారు! గాయనిగా దేశవ్యాప్తంగా పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్న మైథిలి.. బిహార్‌ ఎన్నిలకు కొద్దివారాల ముందే బీజేపీలో చేరారు. అయినా ఆమెను అలీనగర్‌ ప్రజలు ఆదరించారు. హిందీ, భోజ్‌పురిల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మైథిలి ఠాకూర్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే ప్రధాని మోదీ కూడా ఆమెను పలుమార్లు ప్రశంసించారు. తాజా ఎన్నికల్లో మైథిలి తన సమీప ప్రత్యర్థి, ఆర్జేడీ సీనియర్‌ నేత వినోద్‌ మిశ్రాపై 11,730 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బిహార్‌లో అత్యంత పిన్నవయస్కురాలైన ఎమ్మెల్యేగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో మైథిలికి కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారు. 2000 జూలై 25న జన్మించిన మైథిలి.. 11 ఏళ్ల వయసులోనే సరిగమప లిటిల్‌ చాంప్స్‌ రియాలిటీ షోకు వెళ్లారు. ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌ పోటీల్లోనూ పాల్గొన్నారు. 2017లో రైజింగ్‌ స్టార్‌ కార్యక్రమంలో రన్నర్‌పగా నిలిచారు. అక్కడి నుంచి ఆమెకు ప్రజాదరణ పెరిగింది.

Updated Date - Nov 15 , 2025 | 04:24 AM