Howard Lutnick warned: ఫిబ్రవరిలోగానే హెచ్-1బీలో గణనీయ మార్పులు
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:01 AM
హెచ్1బీ వీసాలపై అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 ఫిబ్రవరిలోగానే హెచ్1బీ వీసాల జారీ పక్రియలో పలు గణనీయమైన ...
లాటరీ విధానంతో వారిని తెచ్చుకోవడం ఏంటి?
అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ వ్యాఖ్యలు
న్యూయార్క్, సెప్టెంబరు 30: హెచ్1బీ వీసాలపై అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 ఫిబ్రవరిలోగానే హెచ్1బీ వీసాల జారీ పక్రియలో పలు గణనీయమైన మార్పులు ఉంటాయని వెల్లడించారు. చౌకైన టెక్ నిపుణుల కోసం ఈ వీసాలు జారీ చేయడం అనే ఆలోచన తప్పు అని, వారితో పాటు వారి కుటుంబాలు కూడా దేశంలోకి వస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ వీసాల జారీ ప్రక్రియపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్1బీలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యూస్‌నేషన్ మీడియాతో లుట్నిక్ మాట్లాడుతూ, కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2026 నుంచి అమల్లోకి వచ్చే లోగానే పలు గణనీయమైన మార్పులు ఉంటాయని, వీసా ల జారీలో పలు వైవిధ్యమైన మార్పులు చూస్తారని చెప్పారు. లక్ష డాలర్ల ఫీజుతోనైనా వీసాదారులతో దేశం నిండిపోకుండా ఉండాలన్నారు. నైపు ణ్యం ఉన్న వాళ్లని లాటరీ విధానంతో తెచ్చుకోవ డం ఏంటని ప్రశ్నించారు. ఆ విధానంలోనూ మార్పులు ఉంటాయన్నారు. హెచ్1బీ కేవలం టెక్ నిపుణుల కోసమే ఉన్నట్లుందని, వాటిలో 74ు వారే ఉన్నారని వివరించారు. డాక్టర్లు, విద్యానిపుణులు కేవలం 4ు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. ఉన్నత డిగ్రీలున్న డాక్టర్లు, విద్యా నిపుణులు ఎక్కువగా రావాల్సి ఉందన్నారు. కానీ కంపెనీలు ఇంజనీర్లను మాత్రమే నియమించుకోవాలని అనుకుంటే అధిక జీతం పొందే వారిని మాత్రమే తెచ్చుకోవాలని లుట్నిక్ స్పష్టం చేశారు.