karnataka politics: అధిష్ఠానం చెబితే డీకే సీఎం అవుతారు!
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:22 AM
అధిష్ఠానం చెబితే డీకే సీఎం అవుతారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. శివకుమార్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని, తామిద్దరం అన్నదమ్ముల్లా...
హైకమాండ్ ఆదేశాలు శిరసావహిస్తాం: సిద్దరామయ్య
బెంగళూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): అధిష్ఠానం చెబితే డీకే సీఎం అవుతారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. శివకుమార్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవని, తామిద్దరం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని.. భవిష్యత్‌లోనూ తమ బంధం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. నాయకత్వం విషయంలో తామిద్దరం అధిష్ఠానం ఆదేశాలను శిరసా వహిస్తామని వెల్లడించారు. కర్ణాటక కాంగ్రె్‌సలో గందరగోళానికి ముగింపు పలికే దిశగా బెంగళూరు సదాశివ నగర్‌లోని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసంలో ఏర్పాటుచేసిన అల్పాహార విందుకు మంగళవారం ఆయన హాజరయ్యారు. అయితే, సిద్దరామయ్య విధాన సౌధ వద్ద ఎమ్మెల్యేలు గోపాలకృష్ణ, ఉదయ్‌తో సరదాగా మాట్లాడుతూ.. రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. ‘ఏదైనా జరగనీ.. ఆలోచించి బుర్ర పాడుచేసుకునే పరిస్థితిలో లేను’ అని చెప్పారు.