Share News

Ayodhya: 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య రాముడు

ABN , Publish Date - Mar 17 , 2025 | 05:19 AM

‘ఆలయ పర్యాటకం’ వృద్ధి చెందడమే ఇందుకు కారణమని ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఆదివారం తెలిపారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు ఈ మొత్తాన్ని చెల్లించినట్టు చెప్పారు. ఇందులో రూ.270 కోట్లు జీఎస్టీగా, మిగిలిన రూ.130 కోట్లు ఇతర పన్నుల రూపంలో చెల్లించినట్టు వివరించారు.

Ayodhya: 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య రాముడు

అయోధ్య, మార్చి 16: అయోధ్యలోని రామ మందిరాన్ని నిర్వహిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు గత అయిదేళ్ల కాలంలో ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్లు పన్ను చెల్లించింది. ‘ఆలయ పర్యాటకం’ వృద్ధి చెందడమే ఇందుకు కారణమని ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఆదివారం తెలిపారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 2025 ఫిబ్రవరి 5 వరకు ఈ మొత్తాన్ని చెల్లించినట్టు చెప్పారు. ఇందులో రూ.270 కోట్లు జీఎస్టీగా, మిగిలిన రూ.130 కోట్లు ఇతర పన్నుల రూపంలో చెల్లించినట్టు వివరించారు. గత ఏడాది 5 కోట్ల మంది ఆలయాన్ని సందర్శించారని తెలిపారు.

Updated Date - Mar 17 , 2025 | 05:44 AM