Sedition Case: దేశద్రోహం కేసులో సీనియర్ జర్నలిస్టులు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:22 AM
దేశద్రోహం అభియోగాలతో నమోదు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టులు సిద్ధార్థ్ వరదరాజన్, కరణ్ థాపర్‌లకు గువాహటీ పోలీసులు సమన్లు జారీ చేశారు....
సిద్ధార్థ్, కరణ్ థాపర్‌కు గువాహటి పోలీసుల సమన్లు
గువాహటీ, ఆగస్టు 19: దేశద్రోహం అభియోగాలతో నమోదు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టులు సిద్ధార్థ్ వరదరాజన్, కరణ్ థాపర్‌లకు గువాహటీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈనెల 22న గువాహటీలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ సమన్లు వరదరాజన్‌కు ఈనెల 14నే అందగా, కరణ్ థాపర్ సోమవారం అందుకున్నారు. బీఎన్‌ఎ్‌స(భారతీయ న్యాయ సంహిత)లోని సెక్షన్లు 152, 196, 197(1)(డీ)/3(6), 353, 45, 61తో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్(03/2025)ను ప్రస్తావిస్తూ.. క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సౌమర్జోతి రాయ్ తాజా సమన్లను జారీ చేశారు. ‘విచారణకు హాజరు కాకుంటే మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. వీరిద్దరిపై దేశద్రోహం అభియోగాలను నమోదు చేయడంపై జర్నలిస్టు సంఘాలు విస్మయం వ ్యక్తం చేశాయి. క్రైమ్ బ్రాంచ్ ద్వారా జర్నలిస్టులపై అసోం పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ది ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్ ఆరోపించాయి. కరణ్ థాపర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘ది వైర్’ న్యూస్ వెబ్‌సైట్‌పై 2నెలల వ్యవధిలోనే అసోం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారని పేర్కొన్నాయి.