Teacher Hair Massage: క్లాస్ లో పాటలు వింటూ టీచర్ హెడ్ మసాజ్
ABN , Publish Date - Jul 22 , 2025 | 08:30 PM
క్లాస్ రూంలో పిల్లలకు పాఠాలు చెప్పడం మాని, తలకి నూనె పెట్టుకుంటూ.. హెడ్ మసాజ్ చేసుకుంటూ కూర్చొంది ఒక టీచర్. అంతే కాదు, తరగతి గదిలో లౌడ్ స్పీకర్ లో సినిమా పాటలు వింటూ ఈ నిర్వాకానికి పాల్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: తరగతి గదిలో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్ చేసిన నిర్వాకం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. క్లాస్ మొత్తం విద్యార్థినీ విద్యార్థులతో నిండి ఉండగా, పాఠాలు చెప్పడం మాని ఒక టీచర్ స్కూల్ లో తలకు నూనె పెట్టుకుంటూ మసాజ్ చేసుకుంటూ కూర్చొన్న వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు, స్పీకర్ ఆన్ చేసుకుని బాలీవుడ్ సినిమా పాటలు వింటూ సదరు టీచర్ ఈ నిర్వాకం చేసుకుంటూ కూర్చొంది. ఇంట్లో చేసుకోవాల్సిన పనులు, స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టైంలో చేయడమేంటని జనం తిట్టిపోస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని ముందఖేడ అనే ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడతో సదరు సంగీత మిశ్రా అనే ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. ఈ ఉదంతంపై సీరియస్ అయిన జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి లక్ష్మీకాంత్ పాండే దర్యాప్తుకు ఆదేశించారు.
Also Read:
ల్యాండ్ స్నార్కెలింగ్ .. 2025లో సరికొత్త ట్రెండ్.!
పాత బట్టలు పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బే డబ్బు..!
For More Lifestyle News