Share News

Supreme Court: ప్రేమించి.. పెళ్లికి నిరాకరిస్తే రేప్‌ కేసా?

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:52 AM

ప్రేమ బంధం పెళ్లికి దారి తీయని సందర్భాల్లో.. ప్రేమికుడిపై ప్రియురాలు రేప్‌ ఆరోపణలు చేయటం, కేసులు పెట్టటం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి...

Supreme Court: ప్రేమించి.. పెళ్లికి నిరాకరిస్తే రేప్‌ కేసా?

  • పరస్పర సమ్మతితో శారీరక సంబంధం అత్యాచారం కిందికి రాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, నవంబరు 24: ప్రేమ బంధం పెళ్లికి దారి తీయని సందర్భాల్లో.. ప్రేమికుడిపై ప్రియురాలు రేప్‌ ఆరోపణలు చేయటం, కేసులు పెట్టటం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ తరహా కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది నేర న్యాయవ్యవస్థను (క్రిమినల్‌ జస్టి్‌సను) దుర్వినియోగం చేయటం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. కొన్నేళ్లపాటు బంధం కొనసాగించి, పరస్పర అంగీకారంతో శారీరంగా సన్నిహితమైన తర్వాత.. రేప్‌ అని ఎలా ఆరోపించగలరని ప్రశ్నించింది. ఇటువంటి కేసుల్లో రేప్‌ అభియోగాలను నమోదు చేయటం వల్ల.. అత్యంత తీవ్ర నేరమైన రేప్‌ను అపహాస్యం చేసినట్లవుతుందని పేర్కొంది. ఎదుటి వ్యక్తి సమ్మతి లేకుండా లైంగికదాడి జరిపినప్పుడు మాత్రమే రేప్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ప్రేమ పేరుతో మోసగించిన నిజమైన కేసుల్లో చట్టం సున్నితంగా వ్యవహరించాల్సిందేనని తెలిపింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసుపై ధర్మాసనం సోమవారం ఈ తీర్పునిచ్చింది. సదరు వ్యక్తితో మూడేళ్లుగా బంధం కొనసాగించిన ఓ మహిళ.. అతడి వల్ల గర్భం వచ్చిందని, దానిని విచ్ఛిత్తి చేసుకున్నానని, అతడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని పేర్కొంటూ.. రేప్‌ అభియోగాలు మోపింది.

Updated Date - Nov 25 , 2025 | 03:52 AM