Share News

Mohan Bhagwat: ఇంటింటికీ సంస్కృతం చేరాలి

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:07 AM

భారతదేశంలోని అన్ని భాషలకు సంస్కృతం మూలమని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. ఈ భాష దేశవ్యాప్తంగా

Mohan Bhagwat: ఇంటింటికీ సంస్కృతం చేరాలి

నాగ్‌పూర్‌, ఆగస్టు 1: భారతదేశంలోని అన్ని భాషలకు సంస్కృతం మూలమని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. ఈ భాష దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ చేరాలని, అందరూ సంస్కృతంలో మాట్లాడుకునేలా ఉండాలని ఆకాంక్షించారు. శుక్రవారం నాగపూర్‌లోని కవి కులగురు కాళిదాస్‌ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్మించిన అభివన భారతి అంతర్జాతీయ విద్యా భవనం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సంస్కృతం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలు తమ దైనందిన జీవితంలో వాడుక భాషగా ఉపయోగించాలని సూచించారు. మన నిజమైన గుర్తింపు భాషతోనే ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. సంస్కృతాన్ని తెలుసుకోవడమంటే దేశాన్ని అర్థం చేసుకున్నట్లేనని స్పష్టం చేశారు. ఈ ప్రాచీన భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని భాగవత్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Aug 02 , 2025 | 06:07 AM