Sam Pitroda Comments: పాక్‌కు వెళ్తే సొంతింట్లో ఉన్నట్టుంది
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:09 AM
పాకిస్థాన్‌కు వెళ్తే.. సొంతింట్లో ఉన్నట్టుగా ఉంటుంది. నేపాల్, బంగ్లాదేశ్‌లలోనూ అలాంటి అనుభూతే కలుగుతుంది.’’ అని కాంగ్రెస్ పార్టీ విదేశీ...
శాంతి, సామరస్యంతో ఎలా జీవించాలో నేపాల్, బంగ్లాదేశ్‌లను చూసి నేర్చుకోవాలి శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ‘‘పాకిస్థాన్‌కు వెళ్తే.. సొంతింట్లో ఉన్నట్టుగా ఉంటుంది. నేపాల్, బంగ్లాదేశ్‌లలోనూ అలాంటి అనుభూతే కలుగుతుంది.’’ అని కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల నాయకుడు శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అంతేకాదు, పొరుగు దేశాలతో సఖ్యతగా మెలిగేలా భారత విదేశాంగ విధానంలో మార్పు రావాలని ఉచిత సలహా ఇచ్చారు. వాస్తవానికి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు పాక్ వారిని భారత్‌పైకి ఉసిగొల్పుతున్న విషయం తెలిసిందే. ఇక, ప్రజలు, విద్యార్థుల తిరుగుబాట్లతో నేపాల్, బంగ్లాదేశ్‌లలో ప్రభుత్వాలే కుప్పకూలాయి. అలాంటి దేశాలను ప్రశంసిస్తూ తాజాగా పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా మాట్లాడుతూ.. ‘‘ఉగ్రవాదం, విధ్వంసాలు వంటి విషయాలను పక్కన పెట్టి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో భారత్ చర్చించాలి. మన విదేశాంగ విధానం ఆయా దేశాలపై దృష్టి సారించాలి. నిజానికి మనం పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకున్నామా?. ఆయా దేశాలు ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అలాంటి వాటితో యుద్ధం అవసరం లేదు.’’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ దుమారంపై పిట్రోడా స్పందించారు. పొరుగుదేశాలతో భారత్‌కు ఉన్న ఉమ్మడి చరిత్రను నొక్కి చెప్పాలన్నదే తన ఉద్దేశమన్నారు.