Share News

Kailash Mansarovar Yatra: బైక్‌పై కైలాస్‌ యాత్రను పూర్తి చేసిన సద్గురు

ABN , Publish Date - Sep 01 , 2025 | 07:01 AM

మోటారు సైకిల్‌పైకైలాస్ మానససరోవర్‌ యాత్రను పూర్తి చేసిన సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు కోయంబత్తూరులో ఘన స్వాగతం లభించింది. ఈ నెల తొమ్మిదిన ఉత్తరప్రదేశ్‌లో మొదలుపెట్టిన యాత్రను...

Kailash Mansarovar Yatra: బైక్‌పై కైలాస్‌ యాత్రను పూర్తి చేసిన సద్గురు

  • రెండు బ్రెయిన్‌ సర్జరీల తర్వాత జగ్గీవాసుదేవ్‌ యాత్ర

కోయంబత్తూర్‌, ఆగస్టు 31: మోటారు సైకిల్‌పైకైలాస్ మానససరోవర్‌ యాత్రను పూర్తి చేసిన సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు కోయంబత్తూరులో ఘన స్వాగతం లభించింది. ఈ నెల తొమ్మిదిన ఉత్తరప్రదేశ్‌లో మొదలుపెట్టిన యాత్రను సద్గురు 2రోజుల క్రితం పూర్తి చేశారు. రెండు సార్లు బ్రెయిన్‌ ఆపరేషన్లు చేయించుకున్న సద్గురు ఆ తర్వాత 18 నెలలకే ఈ యాత్రను పూర్తి చేయడం గమనార్హం. తన యాత్ర దిగ్విజయంగా పూర్తి కావడం యోగ వల్లనే సాధ్యమైందని సద్గురు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మోటారు సైకిల్‌పై తాను చేసిన ఈ యాత్రలో యోగ ఎంతో ఉపయోగపడిందని అన్నారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా తనను ఈ యాత్ర చేయవద్దని వైద్యులు సూచించారని, యోగాకున్న శక్తిని చాటేందుకు తాను దీనిని చేపట్టి... దిగ్విజయంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఆగస్టు 9న ఆయన ఈ యాత్రను ప్రారంభించారు.

Updated Date - Sep 01 , 2025 | 07:02 AM