Share News

Sabarimala Temple: శబరిమల ఆదాయం 332 కోట్లు

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:34 AM

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుపాటు కొనసాగిన మండల పూజ శనివారంతో వైభవంగా ముగిసింది.

Sabarimala Temple: శబరిమల ఆదాయం 332 కోట్లు

శబరిమల, డిసెంబరు 27: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుపాటు కొనసాగిన మండల పూజ శనివారంతో వైభవంగా ముగిసింది. ఈ పూజ సమయంలో 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని, దీని ద్వారా ఆలయానికి రూ.332.77 కోట్ల ఆదాయం సమకూరిందని ట్రావేన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.జయకుమార్‌ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం సుమారు రూ.35.70 కోట్ల మేర పెరగిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో ఒక్క కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు వచ్చాయని, మిగిలిన మొత్తం ప్రసాదాల విక్రయం, ఇతర వనరుల ద్వారా లభించినట్లు వెల్లడించారు.

Updated Date - Dec 28 , 2025 | 06:35 AM