Rural Roads Scheme: నిరుపయోగంగా ‘గ్రామీణ రోడ్ల’ నిధులు
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:47 AM
గ్రామీణ రోడ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) నిధులు నిరుపయోగంగా మారాయి.
న్యూఢిల్లీ, డిసెంబరు 20: గ్రామీణ రోడ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) నిధులు నిరుపయోగంగా మారాయి. 2025-26 బడ్జెట్‌లో ఈ స్కీమ్‌కు రూ.19 వేల కోట్ల మేర నిధులు కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ కేంద్రం సుమారు రూ.2 వేల కోట్లు (10.5 శాతం) మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన మూడు నెలల్లో మరో రూ.2 వేల కోట్లు వ్యయం చేసినప్పటికీ.. మొత్తం 2025-26లో ఈ పథకంపై ఖర్చు అనుకొన్న దాని కంటే ఇంకా దూరంలోనే ఉంటుంది. తద్వారా కేటాయింపుల్లో రూ.15 వేల కోట్ల మేర నిధులు నిరుపయోగం కానున్నాయి.