Share News

Currency Depreciation: రూపాయి మహా పతనంఅమెరికా డాలర్‌తో రూ.90.15కు చేరిన విలువ

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:11 AM

రూపాయి విలువ మహా పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ఏకంగా రూ.90 దాటింది. కొంతకాలంగా వేగంగా పడిపోతున్న రూపాయి విలువ.. చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మంగళవారం ఒక డాలర్‌కు రూ.89.9475 ఉండగా.....

Currency Depreciation: రూపాయి మహా పతనంఅమెరికా డాలర్‌తో రూ.90.15కు చేరిన విలువ

  • రూపాయి చరిత్రలో ఇదే అత్యంత బలహీన స్థాయి

న్యూఢిల్లీ, డిసెంబరు 3: రూపాయి విలువ మహా పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ఏకంగా రూ.90 దాటింది. కొంతకాలంగా వేగంగా పడిపోతున్న రూపాయి విలువ.. చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మంగళవారం ఒక డాలర్‌కు రూ.89.9475 ఉండగా.. బుధవారం ట్రేడింగ్‌ ఒకానొక దశలో రూ.90.30కు పడిపోయింది. చివరకు రూ.90.15 వద్ద స్థిరపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావటం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం, విదేశీ సంస్థాగత పెట్టుబడులను(ఎ్‌ఫఐఐ) మదుపరులు వెనక్కి తీసుకోవటం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి పతనం ప్రభావం దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలపై భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు జీడీపీ రేటు స్థిరంగా పెరుగుతుందని గణాంకాలు వెలువడుతుండగా, రూపాయి విలువ ఆగకుండా పతనం అవుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే ఏడాది బలపడుతుంది: నాగేశ్వరన్‌

రూపాయి విలువ పతనంపై భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, వచ్చే ఏడాది బలపడుతుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఏడాది ఆసియా దేశాల కరెన్సీల్లో భారత రూపాయి పరిస్థితేఅత్యంత దారుణంగా ఉందని కొటక్‌ సెక్యూరిటీ్‌సకు చెందిన అనంద్య బెనర్జీ తెలిపారు.


పతనానికి కారణాలు మూడు..

డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవటానికి మూడు కారణాలు ఉన్నాయని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

1. కొంతకాలంగా మనదేశంలోకి విదేశీ వ్యవస్థాగత పెట్టుబడుల రాక తగ్గిందని, అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఎఫ్‌ఐఐలను విదేశీ మదుపరులు వెనక్కి తీసేసుకుంటుండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్నదని చెబుతున్నారు.

2. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోకపోవటం రెండో కారణంగా చెబుతున్నారు. రూపాయి విలువ పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్ల నిధుల్లో కొంతమొత్తాన్ని అమ్మేసి రూపాయి విలువను స్థిరీకరిస్తూ ఉంటుంది.

3. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. భారత్‌పై ట్రంప్‌ భారీగా టారి్‌ఫలు విధించారు. ఇవి కూడా రూపాయి పతనానికి కారణాలని చెబుతున్నారు.

రూపాయి పతనం ప్రభావాల్లో కొన్ని..

రూపాయి విలువ పడిపోతే మొదట ప్రభావితం అయ్యేవి దిగుమతులు. మనకు అవసరమైన చమురులో 90 శాతాన్ని, వంటనూనెల్లో 60 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి మరింత ప్రియం కానున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌, వంటనూనెలు, ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల ఖర్చులు తడిసి మోపెడవుతాయి. డాలర్ల రూపంలో విద్యారుణం తీసుకున్న విద్యార్థులు ఇప్పు డు తిరిగి చెల్లించటం మరింత భారం అవుతుంది.

వీరికి లాభం

  • విదేశాల్లో సర్వీసులు అందించే ఐటీ, ఇతర వ్యాపార సంస్థలు రూపాయి పతనంతో లాభపడనున్నాయి. విదేశాలకు ఔషధాలు ఎగుమతి చేసే భారతీయ ఫార్మాకంపెనీలు కూడా లాభపడనున్నాయి.

  • వస్త్రాలను ఎగుమతి చేసే టెక్స్‌టైల్స్‌ కంపెనీలు కూడా లాభపడుతాయి. అయితే, అమెరికాకు వెళ్లే భారతీయ ఉత్పత్తులపై ఆ దేశం 50 శాతం టారిఫ్‌ విధించటంతో భారతీయ కంపెనీలకు లాభాలు పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

  • విదేశాల నుంచి ఆదాయం పొందేవారికి రూపాయి పతనం శుభవార్తే. ఏటా భారత్‌కు విదేశాల నుంచి 138 బిలియన్‌ డాలర్ల వరకు ఈ రూపంలో వస్తున్నాయి. అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గడం వల్ల ఇక్కడ మారకంలో ఎక్కువ డబ్బులు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 04 , 2025 | 06:18 AM