Bihar Assembly Elections: సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న తేజస్వీ
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:37 AM
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తనను తాను బిహార్ విపక్ష మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఆరాలో ఓటర్ అధికార్ యాత్ర చివరి రోజు సభ వేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
మద్దతు ప్రకటించిన అఖిలేశ్.. వేదికపై మౌనంగా రాహుల్
పట్నా, ఆగస్టు 30: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తనను తాను బిహార్ విపక్ష మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఆరాలో ఓటర్ అధికార్ యాత్ర చివరి రోజు సభ వేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ తదితరులు ఉండగా తేజస్వీ ఈ ప్రకటన చేశారు. వెంటనే అఖిలేష్ తేజస్వీకి మద్దతు ప్రకటించారు. కానీ రాహుల్ గాంధీ మౌనం వహించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విపక్ష సీఎం అభ్యర్థిని తానే అని ప్రకటించుకోవడం ద్వారా ఈ విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు తేజస్వీ యత్నించారు. అయితే సీట్ల పంపకాల్లో అంగీకారం కుదరకపోవడమే రాహుల్ మౌనానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.