Share News

US Congressional Report Exposed:ఎప్‌స్టీన్‌తో మస్క్‌ సహా పలువురికి సంబంధాలు!

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:04 AM

లైంగిక నేరస్థుడు, వ్యాపార వేత్త దివంగత జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌, బ్రిటన్‌ రాజకుమారుడు ఆండ్ర్యూ, స్టీవ్‌ బానన్‌ సహా...

US Congressional Report Exposed:ఎప్‌స్టీన్‌తో మస్క్‌ సహా పలువురికి సంబంధాలు!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: లైంగిక నేరస్థుడు, వ్యాపార వేత్త దివంగత జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌, బ్రిటన్‌ రాజకుమారుడు ఆండ్ర్యూ, స్టీవ్‌ బానన్‌ సహా పలువురికి సంబంధాలు ఉన్నాయని అమెరికా చట్టసభకు చెందిన డెమొక్రాట్స్‌తో కూడిన స్థాయీ సంఘం తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’ ఫైల్స్‌ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఎప్‌స్టీన్‌తో పలువురు ప్రముఖులకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, సమావేశాలు, విమాన ప్రయాణ వివరాలు, ఆర్థిక అంశాలను పేర్కొన్నారు. ‘‘ఎప్‌స్టీన్‌ ఎస్టేట్‌ అందించిన మూడో దఫా పలు నివేదికలను పరిశీలించిన తర్వాత ఈ పాక్షిక నివేదికను రూపొందించాం. దీనిలో ఫోన్‌ సందేశాలు, విమానాల బుకింగ్‌ వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఎప్‌స్టీన్‌ దైనందిన చర్య వంటివి ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు. ముఖ్యంగా 2014, డిసెంబరులో మస్క్‌.. ఓ ప్రైవేటు ఐలాండ్‌కు ఎప్‌స్టీన్‌ను ఆహ్వానించినట్టు ఉందని తెలిపారు.

Updated Date - Sep 28 , 2025 | 01:04 AM