Renuka Chowdhury: భౌభౌ.. అన్న రేణుక
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:05 AM
పార్లమెంట్‌కు తన పెంపుడు శునకాన్ని తీసుకురావడమే కాక.. కరిచేవాళ్లు లోపల ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి...
బీజేపీ సభా హక్కుల తీర్మానానికి స్పందన
న్యూఢిల్లీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంట్‌కు తన పెంపుడు శునకాన్ని తీసుకురావడమే కాక.. కరిచేవాళ్లు లోపల ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి బుధవారం మీడియా ముందు భౌ భౌ అని అన్నారు. బీజేపీ ఎంపీలు మీపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టనున్నారని విలేకరులు అడగ్గా.. ఆమె మైకుల ముందుకొచ్చి భౌ భౌ అని అనడం మరింత వివాదాస్పదమైంది.తాను ఏ నిబంధననూ ఉల్లంఘించలేదని, హిందూమతంలో శునకానికి గౌరవప్రదమైన స్థానం ఉందని చెప్పారు. అధికార పార్టీకి హిందూ సంప్రదాయాల తెలియవన్నారు.
లేబర్ కోడ్‌లపై విపక్షాల నిరసన
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదించి, అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను నిరసిస్తూ ఇండి కూటమి నేతలు బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు డీఎంకే, తృణమూల్, వామపక్షాల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కొత్త లేబర్ కోడ్‌లు కార్పొరేట్ సంస్థలకే ప్రయోజనకరంగా ఉన్నాయని విమర్శించారు.