Share News

SL Bairappa Passes Away: సాహితీవేత్త బైరప్ప కన్నుమూత

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:00 AM

కన్నడ సాహితీవేత్త ఎస్‌ఎల్‌ బైరప్ప(94) బుధవారం కన్నుమూశారు. ఆయన హాసన్‌ జిల్లా చన్నరాయపట్టణలో 1931, ఆగస్టు 30న జన్మించారు....

SL Bairappa Passes Away: సాహితీవేత్త బైరప్ప కన్నుమూత

బెంగళూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): కన్నడ సాహితీవేత్త ఎస్‌ఎల్‌ బైరప్ప(94) బుధవారం కన్నుమూశారు. ఆయన హాసన్‌ జిల్లా చన్నరాయపట్టణలో 1931, ఆగస్టు 30న జన్మించారు. తన రచనల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన రాసిన ‘తంతు’ నవలకు భారతీయ భాషా పరిషత్‌ పురస్కారం లభించింది. ‘దాటు’ నవలకు 1975లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. 2010లో మంద్ర నవలకు సరస్వతి సమ్మాన్‌ పురస్కారం లభించింది. సరస్వతీ సమ్మాన్‌ పురస్కారం పొందిన తొలి కన్నడిగుడిగా ఆయన గుర్తింపు పొందారు. బైరప్ప 2023లో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

Updated Date - Sep 25 , 2025 | 04:00 AM