Share News

Indian Navy: నేవీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే పాక్‌ నాలుగు ముక్కలయ్యేది

ABN , Publish Date - May 31 , 2025 | 06:12 AM

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నేవీ సన్నద్ధతను ప్రశంసించారు. INS విక్రాంత్‌ను సందర్శించి, నేవీ భవిష్యత్తులో కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

Indian Navy: నేవీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే పాక్‌ నాలుగు ముక్కలయ్యేది

1971లో భారత నేవీ దెబ్బకు ఆ దేశం రెండు ముక్కలైంది

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యలు

పనాజి, మే 30: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత నౌకా దళం సన్నద్ధమైన తీరును రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. ఇది చూసి పాకిస్థాన్‌ భయపడిపోయిందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత నేవీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి ఉంటే.. 1971 నాటికంటే తీవ్రమైన పరిణామాలను పాకిస్థాన్‌ ఎదుర్కొని ఉండేదని, ఆ దేశం నాలుగు ముక్కలయ్యేదని వ్యాఖ్యానించారు. మన దేశీయ యుద్ధ నౌక ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌ను రాజ్‌నాథ్‌ శుక్రవారం సందర్శించారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో మోహరించి ఉన్న ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఇక ముందు కూడా నేవీ పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

Updated Date - May 31 , 2025 | 06:12 AM