Rajkumar Goel Takes Oath: సీఐసీగా రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణం
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:19 AM
ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ఐఏఎస్ రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 15: ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ఐఏఎస్ రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ గతవారమే రాజ్‌కుమార్ పేరును సీఐసీగా ప్రతిపాదించింది. మరో 8 మందిని కేంద్ర సమాచార కమిషనర్లుగా ఎంపిక చేసింది.